– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు
తుంగతుర్తి, జూన్ 09 : ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఎం నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు డాక్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదని, చిన్నపిల్లల డాక్టర్ లేడని, గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల గర్భిణీలు దూర ప్రాంతాన్ని పోవడం జరుగుతుందని, కావునా వెంటనే ఆయా పోస్టులను నింపాలని డిమాండ్ చేశారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ దవాఖానాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు వల్ల సుదర్శన్, ఉప్పుల సోమయ్య, జాజుగాల్ల ముత్తయ్య, గడ్డం ఎల్లయ్య, మడిపేది యాదగిరి, కందుకూరి చంద్రయ్య పాల్గొన్నారు.

‘తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి’