మునుగోడు, ఏప్రిల్ 08 : లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీని ప్రహసనo చేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణంలో బియ్యం బదులు పైసలు ఇస్తున్నారంటూ కొందరు డీలర్లపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మూడు నెలల రేషన్ ఒకేమారు ఇస్తున్న నేపథ్యంలో కొందరు లబ్ధిదారులు రేషన్ దుకాణంలో బియ్యంకు బదులుగా డబ్బు తీసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో వాయిస్ మెసేజ్ వైరల్ అయిన నేపథ్యంలో సోదాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు.