నల్లగొండ, జూన్ 26 : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పెహచాన్” కార్యక్రమంలో భాగంగా టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ(డబ్ల్యూ), నల్లగొండ కళాశాలలో శుక్రవారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.పవిత్ర వాణి కర్ష, వైస్ ప్రిన్సిపాల్ ఎ.నీలిమ రెడ్డి పర్యవేక్షణలో ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.సి.హెచ్.రజిత, యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ సుల్తానా షేక్ సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. “డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు” అనే అంశంపై పోస్టర్ ప్రదర్శన, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. పవిత్ర వాణి కర్ష మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్‌ను, కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.