కోదాడ, జూలై 02 : కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ పనులను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల తీరును, నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాల గదులను, న్యాయస్థానాల రూపురేఖలను ఆయన పరిశీలించి గుత్తేదారుకు తగు సూచనలు చేశారు. నిర్ణీత సమయంలోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, దేవబత్తిని నాగార్జున, ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, సెక్రటరీ రామకృష్ణ, రంజాన్ పాషా, రంగారావు, పెద్దబ్బాయి, కెవి రావు పాల్గొన్నారు.