మునుగోడు, మార్చి 19 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దన్నారు. మనకున్న నీటి వసతిని బట్టి ముందుగా పంటలను వేసుకోవాలని సూచించారు. అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దన్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందుగా ప్రణాళిక చేసుకుని పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.నరసింహ, రైతులు సాగర్ల మల్లేశ్, పుట్టా శ్రీనివాస్‌రెడ్డి, బొల్లం సైదులు, శివర్ల మహేశ్, వీరారెడ్డి, యాదయ్య, లింగయ్య అండాలు, రాజమ్మ పాల్గొన్నారు.
Munugodu : కల్వలపల్లిలో ఎండిన పంట పొలాల పరిశీలన