కోదాడ, నవంబర్ 26 : దళిత మాదిగ యువకుడు రాజేశ్ మృతి కేసులో కారకులపై 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోజులపాటు పోలీసులు పెట్టిన చిత్రహింసల మూలంగా రాజేశ్ మరణించినట్లు ఆరోపించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర డీజీపీని కలిసి రాజేశ్ మృతిపై నివేదికను అందజేయనున్నట్లు తెలిపారు.
ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, కొండపల్లి ఆంజనేయులు, వడ్డేపల్లి కోటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, చీమ శ్రీనివాసరావు, కర్ల నరసయ్య, బిజెపి జిల్లా కో కన్వీనర్ జల్లా జనార్ధన్ రావు, చెరుకుపల్లి శ్రీకాంత్, పగిడిపల్లి ప్రేమ్, ఏపూరి సత్యరాజు, కుక్కల కృష్ణ, కుడుముల శీను, కాంపాటి ఉపేందర్ ఉన్నారు.