గరిడేపల్లి, నవంబర్ 10 : బడికి వస్తే రోజుకో రూపాయి.. అంటూ సరిగా బడికి రాని పిల్లలను రోజూ వచ్చేలా ఆకర్షిస్తున్నారు గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్. చిన్నచిన్న బహుమతులే విద్యార్థుల జీవితా ల్లో మార్పులు తెస్తాయంటున్నారు ఆయన. నాడు ఆరుగురు మాత్రమే ఉన్న రంగాపురం పాఠశాలలో 20 మంది విద్యార్థులను తయారు చేశారు. నాడు మూతబడే స్థాయి నుంచి విద్యార్థులతో అక్షర సేద్యం చేయిస్తున్నా రు. విద్యార్థులు పాఠశాలకు వచ్చి హాజరుశాతం పెం చేలా వినూత్న కార్యక్రమం చేపట్టారు. రంగాపురం శివారులో 70 జంగాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. స్థిర నివాసం లేకపోవడంతో కుటుంబాల్లోని పెద్దవారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామాలను వీడి, కూలి పనుల నిమిత్తం నిజామాబాద్, శంషాబాద్, చిట్యాల, నల్లగొండ పట్టణాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని నర్సారావుపేట,దాచేపల్లి,విజయవాడ, విస్సన్నపేట తదితర పట్టణాలకు కూలి పనుల నిమిత్తం వెళ్తుంటారు. అలాంటి కుటుంబాల్లోని తాతలు, తండ్రులకు చదువులు, ఉద్యోగాలు లేవు. నేడు వారి పిల్లలకు చదువే ఆయుధం అన్న డాక్టర్ అంబేద్కర్ మాటలను వివరిస్తూ బడికి రప్పిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా కౌన్సెలింగ్ ఇస్తారు. బడికి రాని విద్యార్థులను వెతుకులాడి బైక్పై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొచ్చిబోధిస్తుండటంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగింది.
రూపాయి విలువ తక్కువగా ఉన్నప్పటికీ ,విద్యార్థిని బడికి పంపేలా చేస్తుంది. ఈ విధంగా కూలి పనులు, చిన్నచిన్న పనులు చేసుకునే పేద జంగా లు, ఎరుకల వారి కుటుంబాల్లోని పిల్లలను బడికి రప్పించేలా ఆకర్షిస్తున్నాం. బడికి రాని విద్యార్థులను సైతం వెతుకులాడి బైక్పై ఎక్కించుకుని మరీ పాఠశాలకు తీసుకొచ్చి పాఠాలు బోధిస్తున్నాం.
నేను రోజూ బడికి రావడం చూ సి రాజశేఖర్ సార్ నాకు బహుమతులు ఇస్తారు. అత్యధిక శా తం హాజరు నమోదైనందుకు నాకు బహుమతి వచ్చింది. న న్ను ఉపాధ్యాయులు ప్రోత్సహించడం ద్వారా తెలుగు, ఆంగ్లం ,గణితంలో ఏ అంశంలోనైనా 100 శాతం చేయగలను.
మాకు బహుమతులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు, మిక్చ ర్, అల్పాహారం ఇస్తున్నారు. నే ను రోజూ బడికి రావడానికే ఇష్టపడుతున్నా. బాగా చదివేలా మ మ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.