‘కాంగ్రెస్ పార్టీలో దళితులకు అన్యాయం’
కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్లలో ఆ సంఘం నేతలు..
– రాజ్యాంగ, నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి
దామరచర్ల, ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్లలో ఆ సంఘం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దామరచర్ల మండల నామినేట్ పదవిలో దళితులకు ఈ రోజుకి ఎలాంటి పదవులు దక్కలేదన్నారు. దామరచర్ల మండలం ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఎస్సీలకు నామినేట్ పదవిలో గాని రాజ్యాంగ పదవి గాని కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పదవుల్లో అగ్ర వర్ణాలకే ప్రాధాన్యత దక్కుతుందని జనాభాలో 18 శాతం ఉన్న దళితులకు పదవులు రాలేదనీ, రాజ్యాంగ పరంగా దక్కాల్సిన పదవులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాబోవు నామినేట్ పదవులలో, రాజ్యాంగ పదవులలో అనగా ఎంపీపీ, జడ్పిటీసి పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ అధిష్టానం కడా ఆలోచన చేయాలని కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండలంలో దళిత సంఘం నాయకులు కొమ్ము దాసు, ఆకారపు గోపాల్ మాజీ సర్పంచ్ భైరం నర్సయ్య గారు, మహంకాళి రాజేష్, సందాల శంభయ్య, తాళ్లపల్లి విజయ్, పోలేపల్లి ఉదయ్ , వట్టపు ఉదయ్, బీసీ సంఘం నాయకులు పగిడి జడయ్య యాదవ్ అల్లం నాగరాజు, ఎస్కే గాలిబ్,బలుగూరి విజయ్ కుమార్ కలకొండ హరీష్, కోట రాజు, ఎర్ర మాద కుమార్, మంజుల శ్రీకాంత్, చిలుకూరు అశోక్, సతీష్ కుమార్, కోట చంద్రబాబు,కుక్కల గోపి, కొమ్ము సాయి, తాళ్లపల్లి దావీదు, తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

