సూర్యాపేట టౌన్, మార్చి 19 : తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
అయితే బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూళిపాల ధనుంజయనాయుడు అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ గత బడ్జెట్లో రూ.9 వేల కోట్లు, ఈ బడ్జెట్లో రూ.11 వేల కోట్లు మాత్రమే ప్రకటించారని, బీసీలకు జరిగిన ఈ అన్యాయo పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీలకు రూ.40 వేల కోట్లు, ఎస్టీలకు రూ.17 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం బీసీలకు మాత్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.