రామగిరి, జూన్ 25 : ఫ్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ఫ్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోమ్మరబోయిన నాగార్జున అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండలోని బోయవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 70 శాతం మంది విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫాంలు అందలేదన్నారు.
బాత్ రూమ్ లు సరిగ్గా లేవని విద్యార్థులు తేలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య, నోట్ పుస్తకాలు పూర్తి స్ధాయిలో అందజేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బడిబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీనివాస్, యుగందర్, జెట్టి శివ్రపసాద్, కుంటిగొర్ల లింగయ్య, లింగస్వామి గౌడ్ పాల్గొన్నారు.