గుర్రంపోడ్, జూన్ 06 : గుర్రంపోడ్ మండలంలోని జూనుతుల గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ విధివిధానాలకు లోబడి ఇండ్ల నిర్మాణం జరగాలన్నారు. నిర్మాణాల ప్రక్రియను పరిశీలించి సంతృష్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటే పూర్తి డబ్బులు వస్తాయని తెలిపారు. మండలంలో ఆదర్శ గ్రామంగా ఎంపికైన జూనుతుల గ్రామంలో మొదటి విడతలో 30 మందికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినట్లు వెల్లడించారు. అందులో 23 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టారని, వారిలో 12 మందికి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ మంజుల ఉన్నారు.