– గృహనిర్మాణ సంస్థ ఈఈ వాణీశ్రీ
కట్టంగూర్, జూలై 04 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నల్లగొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఈఈ వాణీశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ లో వివిధ దశల్లో నిర్మాణంలో ఇండ్లతో పాటు రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరఖాస్తు చేసుకున్న గాంధీనగర్ కాలనీ వాసుల ఇంటి స్థలాలు, గుడిసెలను ఆమె శనివారం పీడీ రాజ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి 11 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే సుమారు 3 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అంజన్ రెడ్డి, ఏఈ బానోతు అరుణ, స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్, వార్డు సభ్యులు కళ్లెం నాగేశ్వర్ రావు, శ్రీరామ సంధ్య, ఏకుల సుజాత పాల్గొన్నారు.