కట్టంగూర్, మే 13 : లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ధాన్యం దిగుమతులను పరిశీలించి సమస్యలను రైతులు, మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించి వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంటాలో లేడా వస్తే నిర్వాహకులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.