సూర్యాపేట టౌన్, మార్చి 23 : ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు భరోసా కల్పించడంలో పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు. ఫిర్యాదుల ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగిం చుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.