నల్లగొండ రూరల్, జూన్ 03 : నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో గల తూర్పు చెరువులో గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం వెలుగు చూడడంతో స్పందించిన నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం హుటాహుటిన గ్రామంలోని తూర్పు చెరువు మట్టి తరలించే ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించడం పట్ల వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ఫొటోలు దిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంతే మరో గంటలోనే అక్కడ అక్రమ మట్టి రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
ఇదే విషయంపై నీటి పారుదల శాఖ డీఈ సతీశ్‌చంద్రను వివరణ కోరగా రొటీన్‌గా అనుమతులు తీసుకుంటామని మట్టి తరలించేవారు చెప్పినట్లు చెప్పారు. అధికార పార్టీకి చెందిన వారే ఈ మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండడంతో అధికార యంత్రాంగమంతా సైలెంట్ గా ఉంటున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి తరలింపును ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.
Nalgonda Rural : అన్నెపర్తిలో ఆగని మట్టి మాఫియా