అర్వపల్లి, మే 12 : అక్రమ అరెస్టులను అంతా ఖండించాలని అఖిల భారత రైతు కూలి సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ అన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు నేడు నాగార్జున సాగర్ సందర్శనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అర్వపల్లి పోలీసులు సోమవారం పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఎలాంటి పిలుపు లేనప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలను పట్టించుకోని ప్రభుత్వాలు అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, ఇదేందని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నట్లు తెలిపారు. వెంటనే అందాల పోటీలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.