సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కొండూరు..

నల్లగొండ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయమని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ఛీప్ అడ్వైజర్, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రతినిధి బృందం విన్నపాన్ని మన్నించి అధికారికంగా నిర్ణియిండచం గొప్ప పరిణామం అని అన్నారు. సహాకరించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హారీశ్ రావు , బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమాలకర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.