నల్లగొండ సిటీ, అక్టోబర్ 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ మండల తాసీల్దార్ పద్మ అన్నారు. కనగల్ మండలంలోని వేమిరెడ్డిగూడెం, పగిడిమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమలత, ఏపీఎం మహేశ్వర రావు, సీసీ ఈదయ్య, నిర్వాహకులు జ్యోతి, నాయకులు గోలి జగాలు రెడ్డి, నర్సిరెడ్డి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.