నల్లగొండ, జులై 15: సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటు గల్లంతు అవుతుందనే భయం ఓటర్లలో ఉంటే ఆ ఓటర్ల భయాన్ని పోగొట్టడానికి బీఎల్వోలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. కారణం వారికి సర్‌పై నామమాత్రంగా అవగాహన ఉండటమే కారణంగా తెలుస్తున్నది. 2002 నుంచి ఒకే ప్రాంతంలో ఓటు ఉన్న వారి వివరాలు సర్ ఫామ్‌తో పాటు బీఎల్ వోల వద్దనే ఉండటంతో వారికి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే 2002లో ఒక నియోజక వర్గం, ప్రస్తుతం మరో నియోజక వర్గంలో ఓటు ఉన్న వాళ్లతోపాటు 2002లో అస లు ఓటు లేనివాళ్లు వారి తల్లిదం డ్రుల వివరాలు ఇవ్వకపోవ టం… ఆ వివరాలు ఉన్న సైట్ ను సందర్శించే పరిజ్ఞా నం, అవగాహన బీఎ ల్వోలకు లేదు. ఈ విష యం పక్కన పెడితే చాలామంది సర్ ఫారమ్‌లోని రెండో బాక్స్ మాత్రం అసంపూర్తిగా నింపి ఆన్లైన్ చేస్తుండటం గమనార్హం. అయితే సర్ ప్రక్రియ ఇంతైంది..అంతైంది..అనే అధికారులు మాత్రం ఆ ఫారాలను పూర్తి స్థాయిలో ఏ మేరకు నింపి ఆన్లైన్ చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించటంలో విఫలమవుతున్నారు.
ఓటు లేకపోయినా.. మరో ప్రాంతంలో ఉన్నా సమస్యే
1989లో నల్లగొండ మండలంలోని ముషంపల్లిలో పుట్టిన జాన కమ్మ అనే మహిళకు 2002లో ఓటు లేదు. అనంతరం ఆమె తిప్పర్తి మండలం పజ్జూర్లో ఓటు వేసింది. అయితే ప్రస్తుత సర్ ఫామ్‌లో ఆమె మొదటి బాక్స్ కాకుండా రెండో బాక్స్‌లో తన తల్లిదండ్రులు, లేదంటే తాత, నానమ్మల ఓటు వివరాలు ఫిల్ చేయాలి. అందులో ప్రధానంగా వారి పేరు, బంధుత్వం, రాష్ట్రం తో పాటు నియోజక వర్గం పేరు, భాగం సంఖ్య (పోలింగ్ స్టేషన్ నంబర్), క్రమ సంఖ్య రాసి మూడో బాక్స్‌లో ప్రస్తుత వివరాలు ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే రెండో సంఖ్యలో మాత్రం జాన కమ్మ స్వగ్రామమైన ముషంపల్లిలో తన బంధువుల వివరాలు లేకుండానే బీఎల్వోలు ఫామ్ నింపి ఆన్లైన్ చేస్తున్నారు. అదే విధంగా 2002లో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఓటు హక్కు ఉంటే మొదటి బాక్స్‌లో నియో జక వర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య నం బర్లు తెలియక ఫిల్ చేయకుండానే ఆన్లైన్ చేస్తున్న పరిస్థితి.
బీఎల్వోల అవగాహన లోపమే కారణమా..
సర్ ఫారాలు పూర్తిగా నింపే బాధ్యతను పూర్తిగా బీఎల్వోలకు అందచేసిన అధికారులు పైపైన పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ చేపడుతున్న బీఎల్వోల్లో సింహభాగం పదోతరగతి వరకు చదివిన అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, వీబీకేలు ఉన్నారు. 2002లో ఓటు లేని వారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు రెండో బాక్సులో నింపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైట్(voter.eci.gov.in) ఓపెన్ చేసి అందులోని వివరాలు చెప్పటం లేదు. దాంతో సర్ ఫారాన్ని అసంపూర్తిగా పూర్తిచేసి ఆన్లైన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్ ప్రక్రియ చేపడుతున్న బీఎల్వోలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వలేదా..లేదా ఇచ్చినా అవగాహనా రాహిత్యం వల్ల సర్ ఫారాలు పూర్తిగా నింపలేకపో తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి బాక్స్‌లో ఉన్న భాగం సంఖ్యతో పాటు క్రమ సంఖ్య కూడా సర్ మ్యాపింగ్‌కు అవసరం. లేకుంటే సర్ లింక్ కానట్టే.
లింక్ కాకపోతే నోటీసులు.. లేదంటే కొత్తగా నమోదు
ఈనెల 24వ తేదీ వరకు ఓటు హక్కు కలిగిన వారు ఒకటి రెండు బాక్సులు నింపినా నింపకపో యినా కనీసం మూడో బాక్స్ నింపి ఇవ్వండని అదికారులు చెబుతున్నారు. ఇలాంటి వారి ఫారాలు కూడా ఆన్లైన్ చేసినప్పటికీ జూలై-31 తర్వాత సర్ లింక్ కాలేద ని.. ఒకటి, రెండు బాక్సుల కారణాలు చూపుతూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసులకు తగిన ఆధారాలతో రిైప్లె ఇవ్వకపోయినా.. ప్రస్తుతం సర్ ఫారామ్ నింపకపోయి నా ఓటు గల్లంతు కానుంది. ఆ తర్వాత ఓటు లేని వాళ్లు మళ్లీ ఫామ్-6తో నూతనంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రెండు చోట్ల ఓటు ఉన్న వారికీ మ్యాపింగ్..
సర్‌లో భాగంగా మున్సిపాలిటీలతోపాటు గ్రామీణ ప్రాం తాల్లో ఓటు ఉన్నవారు ఒకే దగ్గర ఫారాలు ఇవ్వాలని అధికారులు చెబుతున్నప్పటికీ కొందరు రెండు చోట్లు ఇస్తుండటం గమనార్హం. రెండు చోట్ల ఇవ్వొద్దని..ఇస్తే కేసు ఫైల్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇచ్చినా ఒకే దగ్గర మ్యాపింగ్ అవుతుందే తప్ప రెండో చోట కాదని అంటున్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తెలియకుండా మ్యాపింగ్ చేస్తే ఓకే అవుతున్నట్లు చెబుతున్నా తుది జాబితాలో ఎలా వస్తుందో చూడాలి.
అన్ని కాలాలు పూర్తిచేస్తేనే మ్యాపింగ్
2002లో ఓటు వేసిన వారు మొదటి, మూడో బాక్సులో తమ వివరాలు…2002లో ఓటు వేయని వారు తల్లిదం డ్రులు, లేదంటే తాత, నానమ్మ వివరాలు పూర్తి చేసి నియో జకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య వివరాలు వేయాలి. లేదంటే సర్ లింక్ కాదు. దాని వల్ల నోటీసు అందుకోని దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. బీఎల్వోల దగ్గర ఉన్న సమాచారంతో పాటు ఎలక్షన్ సైట్ ద్వారా 2002లో మీ బంధువుల వివరాలు తెలుసుకోని ఫారం పూర్తి చేయాలి.
– పరుశరామ్, తాసీల్దార్, నల్లగొండ