చండూరు, డిసెంబర్ 08 : నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని ఇడికూడా గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాల్వాయి రమాదేవి శ్రవణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలకు అనుగుణంగా ఆయన కోడలుగా తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పాటు గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా తన సొంత నిధులతో గ్రామంలోని సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు.
ఓటు వేసే బ్యాలెట్ పత్రంలోని వరుస సంఖ్య 2లోని కత్తెర గుర్తుపై ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి శాంతన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల లింగయ్య, మాజీ ఉప సర్పంచ్ నాంపల్లి రమ్య గణేశ్, బీజేపీ నాయకులు జెట్టి యాదయ్య, వీరమల్ల మల్లేశ్, రై మున్నేసా బేగం సత్తార్, అబ్బనబోయిన యాలాద్రి, నల్ల శ్రీనివాస్, కడారి నరసింహ, ఏరుకొండ శేఖర్, ఇరిగి సునీత కిరణ్, ఇరిగి రాజు, బోయపల్లి సత్యనారాయణ, ఎండి జాకీర్ పాల్గొన్నారు.

Chandur : ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా : పాల్వాయి రమాదేవి శ్రవణ్