కట్టంగూర్, ఏప్రిల్ 19 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామాల్లో బోర్లు, పైపులైన్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు అవరమైతే రైతుల నుంచి బోర్లను అద్దెకు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు చలివేంద్రాన్ని కొనసాగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీఓ చింతమల చలపతి, పంచాయతీ కార్యదర్శి అనిల్ ఉన్నారు.