నిడమనూరు, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనగడ సాధ్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి పృథ్వీరాజ్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు పర్యావరణ సమతుల్యాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టి హరిత రాష్ట్రాలుగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న వీరయ్య, బార్ అసోసియేషన్ కార్యదర్శి పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, న్యాయవాదులు పున్నం సత్యనారాయణ, అబ్దుల్ హలీం, వినోద్, రాకాసి మేఘారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, నాగరాజు, మట్టయ్య పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ : జూనియర్ సివిల్ జడ్జి పృథ్వీరాజ్