కట్టంగూర్, మే 02 : హోటళ్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఎల్పీఓ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ లోని హైవే వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోటళ్లు, దాబాల్లో పరిశుభత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాడే పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంచకూడదని, వంట సామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
వంటలకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచరాదన్నారు. ఎలాంటి మురుగునీరు హోటళ్ల వరిసరాల్లో ఉండకుండా జాగ్రతలు పాటించాలన్నారు. హోటళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీఓ చలపతి, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.