తుంగతుర్తి, మే 15 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేటి నుండి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజలపై భారం మోపే విధంగా పెట్రోల్, డీజిల్ పై లీటరు రూ.3 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీలు ఎన్నడైనా రెట్లు పెంచాయా అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఆయన మండిపడ్డారు.