– సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
అనంతగిరి, జూన్ 09 : పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు నిరసిస్తూ ఈ నెల 10న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అనంతగిరి మండలంలోని శాంతినగర్ లో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు వ్యతిరేకంగా నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్నాయన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, శాంతినగర్ మాజీ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, పార్టీ మండల కార్యదర్శి ఎర్రసాని రవి, మండల సహాయ కార్యదర్శి లాలు, లింగయ్య, చంద్రయ్య, చిన్న సూరయ్య, నారాయణ, వీరన్న, కాసిం సాహెబ్, వీరాచారి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.