సూర్యాపేట మార్కెట్లో కందులకు అత్యధిక ధర
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కంది రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతున్నది. కొద్ది రోజులుగా సూర్యాపేట మార్కెట్లో వ్యాపా రులు కందులకు మద్దతుకు మించి క్వింటాల్‌కు రూ. 7వేల నుంచి 6,500 వరకు కొనుగోలు చేస్తున్నారు.
- క్వింటాకు రూ. 7,173
- సంతోషం వ్యక్తం చేస్తున్న కంది రైతులు
బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 4 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కంది రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతున్నది. కొద్ది రోజులుగా సూర్యాపేట మార్కెట్లో వ్యాపా రులు కందులకు మద్దతుకు మించి క్వింటాల్‌కు రూ. 7వేల నుంచి 6,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. శనివారం అత్యధికంగా రూ 7,173 ధర పలికింది. సమీప మార్కెట్ అయిన ఖమ్మం లో రూ. 6,900, వరంగల్‌లో రూ. 6,700 మాత్రమే ధర పలుకగా రాష్ట్రంలో ఎక్కడా రూ. 7 వేల ధర పలుకలేదు. రాష్ట్రంలోనే సూర్యాపేట మార్కెట్లో క్వింటాల్ కందులు రూ 7,173 ధర పలికి అత్యధికంగా ధరగా నమోదైంది.
సూర్యాపేట మార్కెట్‌కు మొత్తం 23 మంది రైతులు 69 క్వింటాళ్ల కందులను తీసుకురాగా క్వింటాల్ రూ. 6,582 నుంచి రూ. 7,173 వరకు ధర పలికింది.
నిత్య పర్యవేక్షణ..
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకొచ్చిన పంటను నిత్యం పర్యవేక్షిస్తున్నాము. వ్యాపారులు, రైతులనూ ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ మిగతా మార్కెట్ల కన్నా మెరుగైన ధర ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే శనివారం కందులు క్వింటాల్‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 7,173 చెల్లించాం. భవిష్యత్తులో రైతుకు మరింత మంచి ధర వచ్చేలా కృషి చేస్తాము.
– ఎండీ ఫసియోద్దీన్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, సూర్యాపేట
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

