మోతె, జూన్ 05 : పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వరిని ఆశించు చీడపీడల గురించి, పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే గడ్డిపల్లి సీనియర్ సైంటిస్ట్ హెడ్ ఇన్చార్జి డి.నరేశ్ మాట్లాడుతూ.. వివిధ రకాల జీవన ఎరువుల వాడకం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను వివరించారు. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి.అక్షిత్సాయి పీఎం పసల్ బీమా యోజన గురించి వివరించారు.
ఇప్కో నుంచి వచ్చిన ఫీల్డ్ స్టాఫ్ శరత్ నానో యూరియా, నానో డీఏపీ గురించి రైతులకు అవగాహన కల్పిచారు. కేవీకే శాస్త్రీయ సహాయకుడు జి.సంతోష్ పత్తి, మిర్చి పంటల్లో అధిక దిగుబడికి చేపట్టాల్సిన పద్దతులను వివరించారు. మండల వ్యవసాయ అధికారి అరుణ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను వాడాలని రైతులకు వివరించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఝాన్సీరాణి, రైతులు పాల్గొన్నారు.
Mothe : సాగులో సాంకేతికతతో అధిక దిగుబడులు : సీహెచ్ పద్మావతి