కట్టంగూర్, జనవరి 30 : రైతులు వంట మార్పిడి చేసుకోవడంతో భూమిలో సారం పెరిగి అధిగ దిగుబడులు వస్తాయని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో జాతీయ నూనె గింజల పథకం 2025-26 ద్వారా యాసంగిలో విత్తనాలు పంపిణీ చేసిన రైతుల పంట పోలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేరుశనగ సాగులో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తి పంట తర్వాత యాసంగిలో పెసర, మినుము, వేరుశనగ పంటలను సాగు చేయడంతో భూమిలో పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయన్నారు. అనంతరం వేప నూనె, వేరు శనగ పంటల ఉపయోగాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, ఏఓ టెక్నికల్ ఉమారాణి, కీర్తి, ఏఈఓ రమణ, రైతులు గద్దపాటి శ్రీను, కొమ్ము అంజనేయులు, చిరంజీవి, జక్కలి అవిలయ్య, దెందె సురేష్, యోగి పాల్గొన్నారు.