నీలగిరి, డిసెంబర్ 24 : నల్గొండ జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు-పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, దొంగతనాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ, రోడ్డు భద్ర త, యువత సాధికారత వంటి రం గాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల శాతం తగ్గడంతోపాటు శిక్షల శాతం పెరగడం, దోషులకు శిక్షలు వేయించడం, సైబర్ నేరాల తగ్గుదల, దొంగతనాల్లో, సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న నగదు రికవరీలో మంచి ఫలితాలు సాధించారు. అలాగే జిల్లాలో రోడ్డు భద్రతకు చేపట్టిన కార్యక్రమాల వల్ల చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలిగారు. అయితే జిల్లాలో జాతీయ రహదారి ఉండటం వల్ల గం జాయి కేసుల సంఖ్య పెరగగా, ఆదే స్థాయిలో మహిళలపై కూడా నేరాలు పెరిగాయి. మొత్తంగా చూస్తే గతంలో కన్నా ఈఏడు నేరాల శాతం చాలా వరకు తగ్గు ముఖం పట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ బుధవారం విలేకరులు సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ సంవత్సరం 8493 కేసులు నమో దు కాగా గత సంవత్సరం 8,834 కేసులు నమోదైన ట్లు తెలిపారు. అం దులో గత సంవత్స రం తీవ్రమైన నేరా లు 221 నుంచి 169 కి తగ్గడం విశేషమని తెలిపారు. లాభం కోసం హత్యలు, దోపిడీలు పూర్తిగా తగ్గాయి. హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాలు వంటి ప్రధాన నేరాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. ఘోరమైన నేరాల్లో జీవిత ఖైదు, మరణ శిక్షలు సహా మొత్తం 132 దోషులను గుర్తించి, శిక్షల శాతం లో 103 వృద్ధి సాధించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 49,943 కేసులు పరిషారం అయ్యాయి. అనంతరం జిల్లా వార్షిక క్రైమ్ వృద్ధి రేటు బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. సమాశంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీలు కొలను శివరాంరెడ్డి, రాజశేఖర్‌రాజు, శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.
పోలీసు శాఖ అధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా, షీటీమ్‌లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగాయి. గతంలో కన్నా ఈ సంవత్సరం మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది. గతేడాది 684 కేసులు నమోదు కాగా ఈఏడు 703 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు వరకట్న హత్యలు, 10 మహిళల అత్మహత్యల కేసులు, 346 మం దిపై వేధింపులు, 9 మంది మహిళల హత్య కేసులు, 87 మంది మహిళలపై అత్యాచారా లు, ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం 189 మంది మహిళలపై లైంగిక వేధింపుల కేసులు, 27 మంది మహిళల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా 196 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు కేసులు నమోదయ్యాయి. 117 మంది చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడగా పోక్సో కేసులు నమోదయ్యాయి.
ఆస్తి సంబంధిత నేర నియంత్రణలో గణనీయమైన పురోగతి ఉంది. గత సంవత్సరం 700 ఆస్తి సంబంధిత నేరాలపై కేసులు నమోదు కాగా ఈ ఏడు 637 కేసులు నమోదయ్యాయి. ఇది సమర్థవంతమైన పోలీసింగ్, గస్తీ, నిఘా చర్యల వల్ల వీలైంది. గత సంవత్సరం దొంగతనాల్లో 15.17 కోట్లను జనం నష్టపోగా రూ.5.53 కోట్లు రికవరీ జరిగింది. ఈసంవత్సరం ఇప్పటివరకు 5.28 కోట్లు నష్టపోగా 3.33 కోట్ల రికవరీ జరిగింది. రికవరీ గతంలో 36.47% ఉండగా, ఈ సంవత్సరం 63.08%కు పెరిగింది.
గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు నల్ల గొండ పోలీసులు యువ – తేజం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మె గా జాబ్ మేళా నిర్వహించగా, 6,497 మంది నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేసుకోగా, 3,300 మందికి ఉద్యోగాలు లభించాయి. తెలంగాణలోనే తొలిసారిగా నల్లగొండలో రూ.8ల క్షలతో ఏర్పాటు చేసిన SHE LE ADS-Nalgonda Believes కార్యక్ర మం నిర్వహించారు. ఆగస్టు 2025 నుంచి మహిళా పోలీస్ సిబ్బందిని పూర్తి స్థాయి ఫీల్డ్ డ్యూటీల్లో నియమించారు. రాత్రి పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, నేర పరిశీలన, దవాఖాన విధులు, సైబర్ క్రై మ్, పిటిషన్ విచారణల్లో మహిళా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయే మొత్తం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత సంవత్సరం జిల్లాలో 16.31 కోట్లను జనం నష్టపోతే ఈ సంవత్సరం కేవలం 4.62 కోట్లు మాత్రమే నష్టపోయారు. అందులో 1.50 కోట్ల వరకు రికవరీ చేశారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులతో సమన్వయంతో జిల్లా పోలీస్ శాఖ క్రమం తప్పకుండా హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రత్యేక డ్రైవ్ ద్వారా కఠిన చర్యలు చేపట్టం వల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నివారించగలిగారు. గత సంవత్సరం రహదారులపై 41 బ్లాక్ స్పాట్లు ఉంటే ఈ ఏడు 30 మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం 1197 రోడ్డు ప్రమాదాల్లో 390 మంది చనిపోగా, ఈ సంవత్సరం 1078 రోడ్డు ప్రమాదాలు జరిగి 343 మంది చనిపోయారు.
నల్గొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు 24 గంటల నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. అలాగే వీపీవో వ్యవస్థ ద్వారా విసృ్తత స్థాయిలో యాంటీ-డ్రగ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న పెడ్లర్లు, సరఫరాదారులు 53 మందిని అరెస్ట్ చేసి 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు.
నల్లగొండ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు, నాకా బందీలు నిర్వహించారు. జిల్లాలో 10,117 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతోపాటు రూ.14,58,710 జరిమానా వసూలు చేశా రు. అలాగే ఆపరేషన్ స్మైల్ అండ్ ము సాన్ ద్వారా 205 మంది పిల్ల లను రక్షించారు.