త్రిపురారం, జూన్ 25 : నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో ఎస్బీఐ సౌజన్యంతో రాజేంద్రనగర్లోని భారతీయ పరిశోధన స్థానం వారు నిర్వహించిన మెట్ట వరి సాగుపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నేరుగా విత్తే పద్ధతి ద్వారా కూలీల కొరత అధిగమించడమే కాకుండా అధిక లాభాలు గడించడానికి ఆస్కారం ఉందన్నారు.
అదేవిధంగా నేరుగా విత్తే పద్ధతిలో అనువైన వంగడాలను రైతులు శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాడాలన్నారు. మట్టి పరీక్షలు తప్పక చేయించుకోవాలన్నారు. రైతులకు మృత్తిక పరీక్ష కిట్లను అందించారు. నల్లగొండ జిల్లాలో అమలవుతున్న రైతు పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, సాయిప్రసాద్, కవిరాజు, సుష్మ, అజయ్, సాయికుమార్, సాయికిరణ్, రైతులు పాల్గొన్నారు.