పెన్పహాడ్, మే 13 : సాగులో ఆధునిక పద్దతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు బుధవారం పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు అరుణ కుమారి, సునీత ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడం ద్వారా రైతులు పంటలో మంచి దిగుబడి సాదిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు.
తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి రైతులకు సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాల వినియోగించడం వల నేల తల్లి సారాన్ని కపాడిన వల్లమవువుతామని చెప్పారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు ఖచ్చితంగా రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలని తెలిపారు. సాగు నీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనీల్ నాయక్. సర్పంచ్ మామిడి శోభ శ్రీనివాస్, ఏఓ సీహెచ్.శ్రావణి, ఉప సర్పంచ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, మామిడి వెంకన్న, మామిడి సైదులు, పద్మ, రంగారెడ్డి పాల్గొన్నారు.