చందంపేట, జనవరి 16 : చందంపేట మండలంలోని ఏపాలపాయ తండాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కేతావత్ నీలా మకట్ లాల్ ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ, రఘు భగత్, దేవుజా నాయక్, చిన్న నాయక్, రమేశ్, సుభాష్, బాషా, లక్పతి, కళ్యాణ్ నాయక్, బాధ్య నాయక్, ప్రేమ్ కుమార్, రవి కుమార్, లకోజ, మురళి పాల్గొన్నారు.