దామరచర్ల, జూన్ 21 : ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీ నాయక్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘo రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, టీఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరంగి సురేశ్ మాట్లాడుతూ ఫీజుల నియoత్రణకు చట్టo తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు, టై, బెల్టుల అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమoలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు లావూరి రంగా నాయక్, మహేశ్, సాయి, అశోక్, రమేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.