‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టు’
కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో..
– బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నల్లగొండ, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, ఇతర పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ ఎన్నికల ముందు మేడిగడ్డ బారాజ్ వద్దకు వెళ్లి ఎన్నికల్లో లబ్ది పొందింది. తర్వాత పిసి ఘోష్ కమిషన్ పేరుతో కేసీఆర్, హరీష్ రావుపై అభియోగం మోపింది. 37 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కాళేశ్వరం కూలి పోయిందని అబాసుపాలు చేసే ప్రయత్నం చేసింది. కానీ నిన్న హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పింది. ఘోష్ కమిషన్ ముందే గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నూ రూపొందించింది. తాము అది నుండి చెప్పిందే హైకోర్టు నిర్ధారించింది.
కాళేశ్వరం లక్ష కోట్లు వృథా అంటూ బదనాం చేశారు. కావాలని సీఎం, రాష్ట్ర మంత్రి వర్గం ఏపీ ప్రయోజనాలకు కోసం పని చేస్తున్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు క్రాక్ వస్తే ఎల్ అండ్ టీ సంస్థ బాగు చేస్తా అంటే చేయకుండా అడ్డుకున్నారు. ఇపుడేమో సీఎం మళ్లీ మేడిగడ్డకు వెళ్లి బాగుచేస్తా అంటున్నారు. గత ప్రభుత్వాన్ని అబాసూపాలు చేయడానికే పీసి ఘోష్ కమిషన్ వేశారని హైకోర్టు తెల్చింది. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసి కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ కు తోడుగా బీజేపీ దొంగలు తయారయ్యారు. పార్లమెంట్ లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అట్లానే మాట్లాడుతాడు. కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టులాంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో డిండి లిఫ్ట్‌కు రోజూ 0.5 టీఏంసీల నీరు రావాలి, కానీ వట్టెం నుండి డిండికి నీరు వచ్చే కాల్వ ఎత్తు పెంచడం వళ్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జిల్లా నుండి సంబందిత మంత్రి ఉత్తమ్ ఉన్నా పట్టించుకోవడం లేదని, డిండి ఎత్తిపోతల నష్ట నివారణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టు’
తెలంగాణ రైతాంగానికి సగం సాగునీరు అందేలా
బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసింది. కాళేశ్వరంను పక్కన పెట్టి ఆంధ్ర వాళ్లకి నీళ్లు వదిలేసే విధంగా ప్రభుత్వ తీరు ఉన్నది. 230 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేలా కాళేశ్వరం నిర్మాణం జరిగింది. తెలంగాణ రైతాంగానికి సగం సాగునీరు అందేలా కేసీఆర్ కాళేశ్వరం రూపొందించారు. కాళేశ్వరం నిజంగా కూలిపోతే గంధమల్ల నుండి ఆలేరు ఎమ్మెల్యే నీళ్లు ఎలా ఇచ్చాడు. మూడేండ్లలో కష్టపడి నిర్మాణం చేస్తే కేసీఆర్, హరీష్ రావుపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ… పీసీ ఘోష్ నివేదిక కేసీఆర్, హరీష్ రావులపై చర్య తీసుకోవడం కుదరని హైకోర్టు స్పష్టం చేయడం స్వాగతిస్తున్నాం. చరిత్రత్మక కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కు చెంప పెట్టు లాంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది. కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కమిషన్లు, నోటీసుల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. తెలంగాణ పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవ్వరూ సంకించలేరు. ఆధారాలు లేని ఆరోపణలు చట్టం ముందు నిలబడవని మరోసారి స్పష్టం అయిందన్నారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టు’
తప్పుడు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్
కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలకు చెంప పెట్టు లాంటిది. హామీలను పక్కన పెట్టి కేసీఆర్, హరీష్ రావు లపై తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తుంది. పంట కొనుగోళ్లు లేవు. కరెంట్ రాదు. యూరియా దొరకదు. రైతులను గాలికి వదిలేశారు. ధాన్యం కొనాలని జిల్లా మంత్రులకు లేదు. కేవలం కమిషన్ల పైనే శ్రద్ద. ఆరు లక్షల టన్నుల ధాన్యం కొంటారో చెప్పాలి. కేసీఆర్ హయాంలో తరుగు పేరుతో ఎప్పుడు రైతులను మోసం చేయలేదు. ఒక క్వింటాలు పేరుతో 8-9 కిలోలు కట్ చేస్తున్నారు. రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటాం. త్వరలో అవసరం అయితే కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిస్తాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాళ్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు.

‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టు’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- Congress
- Kaleswaram project
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

