నల్లగొండ రూరల్, మే 30 : పవర్లూమ్ కార్మికుడు అనుమాల శ్రీనివాస్ బ్రతుకుదెరువు కోసం సిరిసిల్ల నుండి పద్మనగర్ నల్లగొండకు వచ్చాడు. ఇక్కడ కూడా పవర్లూమ్ కార్మికుడిగా పనిచేశాడు. కాగా పక్షవాతంతో అనారోగ్యం పాలయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతనికి పక్షవాతంకు సంబంధించిన మందులు నల్లగొండ జిల్లా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ మూడు నెలలకు సరిపోను మందులు రూ.10,500 ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, ఉపాధ్యక్షుడు గంజి రామలింగం, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం నాయకులు పున్న రమేశ్, వనం చంద్రశేఖర్, మూడా వేణు పాల్గొన్నారు.