యాదాద్రి భువనగిరి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడత జిల్లాలోని ఆరు మండలాల్లో 46 నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండో రోజు సర్పంచ్ పదవి కోసం 176 నామినేషన్లు దాఖలయ్యాయి. తుర్కపల్లి మండలంలో అత్యధికంగా 96 పత్రాలు స్వీకరించారు. ఆలేరులో 40, రాజాపేటలో 56, యాదగిరిగుట్టలో 60, ఆత్మకూరు (ఎం)లో 78, బొమ్మలరామారంలో 67 నామినేషన్లు వచ్చాయి. రెండు రోజులు కలిపి సర్పంచ్ స్థానానికి 397 నామినేషన్లు స్వీకరించారు. వార్డులకు సంబంధించి గురువారం 497 దాఖలు కాగా తుర్కపల్లిలో 181, బొమ్మలరామారంలో 119, యాదగిరిగుట్టలో 143, రాజాపేటలో 94, ఆత్మకూరు (ఎం)లో 65, ఆలేరులో 46 నామినేషన్లు వచ్చాయి. వార్డుల కోసం 648 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
సూర్యాపేట, నవంబర్ 28: సూర్యాపేట జిల్లాలో తొలి విడుత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్, తుంగతుర్తి, తిరుమలగిరి, మద్దిరాల నాగారం, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 159 సర్పంచ్ స్థానాలకు, 1,442 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం రెండో రోజు తుంగతుర్తి మండలంలో 25, నాగారం మండలంలో 17, నూతనకల్ మండలంలో 18, తిరుమలగిరి మండలంలో 7, జాజిరెడ్డిగూడెం మండలంలో 11, మద్దిరాల మండలంలో 23, సూర్యాపేట మండలంలో 22, ఆత్మకూర్.ఎస్ మండలంలో 36 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు తుంగతుర్తి మండలంలో 16, నాగారం మండలంలో 36, నూతనకల్ మండలంలో 26, జాజిరెడ్డిగూడెం మండలంలో 7, మద్దిరాల మండలంలో 13, సూర్యాపేట మండలంలో 20, ఆత్మకూర్.ఎస్ మండలంలో 24 నామినేషన్లు దాఖలయ్యాయి.
నల్లగొండ, నవంబర్ 8 : సర్పంచ్ ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, చండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. 14 మండలాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 249, వార్డు స్థానాలకు 729 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం సర్పంచ్ స్థ్దానాలకు 365, వార్డుస్థానాలకు 735 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.