పెన్‌పహాడ్, మార్చి 28 : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి పెండెం వెంకట రమణ సందర్శించి అందిస్తున్న వైద్య సేవలపై రోగులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాల్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. సిబ్బంది లభ్యత, మందుల నిల్వలు, వైద్య సేవలపై మండల వైద్యధికారి రాజేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో మొత్తం 372 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ గాజుల చంద్రశేఖర్, తాసీల్దార్ లాలూ నాయక్, సర్పంచ్ ఒగ్గు రవి. డాక్టర్లు మానస, నందిని, సమీరా, కుమార్ నాయక్, యశ్వంత్, అర్చిత, తడూరి వెంకన్న, వెంకయ్య, పులమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌లో ఆరోగ్య శిబిరం