దేవరకొండ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శనివారం మండలంలోని గన్యానాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని పేద ప్రజలు పట్టణాలకు వెళ్లి వైద్య చికిత్స చేయించుకోవడం ఆర్థికంగా భారంగా ఉంటుందని, అందుకే గ్రామంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి యశోద హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉచితంగా పరీక్షించి మందులను అందజేశారు.
ఈ రోజు దాదాపు 300 మంది పేద ప్రజలకు ఈ సేవలు అందించనున్నామని కిషన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు నల్ల మాద నారాయణరెడ్డి, లకుమారపు మల్లయ్య, గాజుల రాజేష్, ఆంజనేయులు, కొండయ్య, మాజీ సర్పంచ్ నేనావత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.