నల్లగొండ సిటీ, జూన్ 04 : నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సైదులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఎస్ఐ విష్ణుమూర్తి కౌన్సిలింగ్ నిర్వహించి సైదులు నేత్ర దానానికి ఒప్పించారు. దీంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ సైదులు నేత్రాలను సేకరించింది. ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియా అంధులకు చూపు లభించింది. పుట్టెడు దుఃఖంలోనూ బాధలను దిగమింగి సైదులు కుటుంబ సభ్యులు చూపిన త్యాగం మరువలేనిదని లయన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.