అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నా
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆరు నెలలుగా అభివృద్ధ్ది పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
- చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చౌటుప్పల రూరల్, అక్టోబర్ 3 : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆరు నెలలుగా అభివృద్ధ్ది పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో రూ.1.50 కోటితో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, గౌడ,రజక, ఎస్సీ కులస్తుల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన నాటి నుంచి నేటి వరకు నియోజక వర్గంలో పర్యటిస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నానని అన్నారు.
ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నా నాయకులు ఎవరో ప్రజలు గుర్తిస్తున్నారని, ప్రజా సేవచేసే వారికే ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అనంతరం ధర్మోజిగూడెం గ్రామంలో పర్యటించి గ్రామంలో చేపట్టాల్సి పనులపై గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను గుర్తించారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలో ప్రారంభిస్తానని ప్రజలకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మల్కాపురం సర్పంచ్ ఎలువర్తి యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్‌గౌడ్, ఉప సర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ, సుంకరి సత్యనారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్ దౌడి బాలరాజు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మస్తాన్‌బాబు పాల్గొన్నారు.
మున్సిపల్ మీటింగ్ హాల్ నిర్మాణ పనుల పరిశీలన
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపల్ మీటింగ్ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వాటిపై తగిన సూచనలు చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్లు బాబా షరీఫ్, ఆలె నాగరాజు, కోరగోని లింగస్వా మి, బండమీది మల్లేశ్, సుల్తాన్ రాజు, తాడూరి పరమేశ్, సందగళ్ల విజయ, కాంశెట్టి శైలజ పాల్గొన్నారు.
నేడు గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభం
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 3 : మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజన గరుకుల పాఠశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బాలుర గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గిరిజన గురుకల పాఠశాలను బుధవారం ప్రారంభించనున్నారు. మండల కేంద్రంలో తాత్కాలిక భవనంలో బాలుర గిరిజన గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు .ప్రస్తుతం గిరిజన గురుకుల పాఠశాలలో 5,6వ తరగతులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇప్పటి వర కు 50 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని గిరిజనఒ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

