నల్లగొండ, మే 1 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం నల్లగొండ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ చండూర్లో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో రోడ్ షో చేపట్టనున్నారు.
హైదరాబాద్ రోడ్ వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగనున్న రోడ్ షోలో హరీశ్‌రావు మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బుధవారం నల్లగొండలో ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి పరిశీలించారు. వారి వెంట నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు జమాల్ ఖాద్రి, వట్టిపల్లి శ్రీనివాస్, గంజి రాజేందర్ తదితరులు ఉన్నారు.