సూర్యాపేట టౌన్, మార్చి 25 : విజయానికి అడ్డదారులు ఉండవని, విజయం సాధించాలంటే శ్రమయే మార్గమని విద్యార్థులు నిత్యం శ్రమించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని స్పందన డిగ్రీ , పీజీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పాఠ్యంశాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. గొప్ప విజయాలు సాధించిన వారి విజయ గాథలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, వాసుదేవరావు, వేణుగోపాల్, నాగిరెడ్డి, మారం వెంకట్ రెడ్డి, యాదవరెడ్డి, సత్యం బాబు, భగవాన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.