తుంగతూర్తి, జూన్ 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ను వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య హెచ్చరించారు. కేసీఆర్‌ను వేదించడమే పనిగా పెట్టుకుని కాళేశ్వరం పేరుతో తప్పుడు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్‌పై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. తప్పుడు కేసులు బనాయించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడిని వేదిస్తే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదన్నారు.
అతి తక్కువ కాలంలో దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మించిన గొప్ప ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు మట్టిపెల్లి శ్రీశైలం, తునికి సాయిలు, దొంగరి శ్రీనివాస్, తడకమళ్ల రవి కుమార్, మట్టిపెల్లి వెంకట్, కడారిదాసు, మల్యాలా రాములు, కొండగడుపుల నాగయ్య, గోపగాని శ్రీనివాస్, నాగమల్లు, వెంకటేశ్, సాయికిరణ్, శ్రీకాంత్, మల్లిఖార్జున్, సాయి, మధు మహేందర్, భాస్కర్, వెంకన్న, భగవాన్, క్రాంతి పాల్గొన్నారు.