కోదాడ, ఆగస్టు 07 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత లభించిందని, కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కోదాడలో తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రె రాజేశ్, కొంగరి నరసరావు, పిండిప్రోలు శ్రీనివాస్, వెంకట్రావు, కోటయ్య, శేషగిరిరావు, రత్నాకర్ రావు పాల్గొన్నారు.