తుంగతుర్తి, నవంబర్ 06 : తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్దార్ దయానంద తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడాకారులు ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేకంగా అలరించింది. అనంతరం విద్యార్థినులు శాస్త్రీయ నాట్య వస్త్రధారణలో విఘ్నేశ్వరుడి డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీఐ నరసింహ, ఎస్ఐ క్రాంతి కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Thungathurthy : తుంగతుర్తిలో గురుకుల జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

Thungathurthy : తుంగతుర్తిలో గురుకుల జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం