పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుడిపల్లిని ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 11 రెవెన్యూ గ్రామాలతో మండలం ఏర్పాటుకు గత నెల ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అభ్యంతరాలకు అవకాశం ఇచ్చింది.
ప్రజల నుంచి అభ్యంతరాలు రాలేదు. దాంతో చిల్కమర్రి, రోళ్లకల్, సూరేపల్లి, గుడిపల్లి, ఘనపురం, ఘాట్నెమలిపురం, మాదాపురం, పొల్కంపల్లి, భీమనపల్లికొప్పోలు, ఘనిపల్లి, కేశంనేనిపల్లి గ్రామాలతో మండలం ఏర్పాటు చేసింది.. ఈ సందర్భంగా గుడిపల్లి మండల సాధన సమితి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు గట్టుప్పల్ మండలం ఏర్పాటు కాగా తాజాగా గుడిపల్లి ఏర్పాటుతో నల్లగొండ జిల్లాలోని మండలాల సంఖ్య 33కు చేరింది.
– పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 25