నకిరేకల్, నవంబర్ 23 : ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు అనుచరులతో దాడులు చేయిస్తూ బరి తెగిస్తున్నదని షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు అన్నారు. నకిరేకల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గూడపురి సురేశ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అనుచరులు కత్తులతో దాడిచేయడాన్ని ఖండిస్తూ స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెదిరింపులు, మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అనుచరుల దాడులు చేస్తూ నకిరేకల్ నియోజకవర్గాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారన్నారు.
నకిరేకల్ పట్టణంలో అర్ధరాత్రి కత్తులతో, కర్రలతో కాంగ్రెస్ గుండాలు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. నకిరేకల్ పట్టణంలోని 17వ వార్డుకు చెం దిన గూడపురి సురేశ్, ఆయన భార్య స్వప్నను వీరేశం అనుచరులు బెదిరించి దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఇటీవల ప్రచారంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తాము గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి కేతేపల్లి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలను ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం నకిరేకల్ పట్టణంలో అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి ఈ రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమ ర్శించారు. నకిరేకల్‌లో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని, వ్యక్తిగత దాడులు, మహిళలపై దాడులు చేస్తురన్నారు ఆందోళన వ్యక్తం చేశా రు.
గొడవలు కావాల్నా? అభివృద్ధి కావాల్నా? మనుషులను చంపుతామని బెదిరించే నాయకులు కావాల్నా? ఆలోచన చేయాలని కోరారు. మారణాయుధాలతో బజార్లలో రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో తిరుగుతూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను చంపుతామని కాంగ్రెస్ గూండాలు తిరుగుతున్నారని ఆరోపించారు. సురేశ్‌ను అప్రమత్తం చేయకపోతే చంపేశవారని, ఇకనైనా ఇలాంటి పనులు మానుకోవాలన్నారు. ని త్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని ప్రశాంత వాతావరణంలో ఉండేలా చేస్తున్న చిరుమర్తి లిం గయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి కృష్ణమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ యాదగిరి, లింగారెడ్డి పాల్గొన్నారు.