పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 28 : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో కీలక భాగమైన పుట్టంగండి పంప్‌హౌస్‌లో కొద్ది రోజులుగా గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పంప్‌హౌస్ పైపులైన్ భాగంలో కాంక్రీట్ గోడ నుంచి కొద్ది రోజులగా సీపే జ్ నీరు వస్తుంది.
దాంతో దానికి అనుకుని ఉన్న ఇనుప పిల్లర్లు తుప్పు పట్టడంతో మరమ్మతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో కొద్ది రోజులుగా గోడలకు గ్రౌటింగ్ చేపట్టి లీకేజీలను అరికడుతున్నారు. భవిష్యత్‌లో పంప్‌హౌస్‌కు ఎటువంటి ప్రమాదం ఉండకుండా గత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టగా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి.