‘రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి’
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణుమాధవరావు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మాచారం, అనాజీపురం, అనంతారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన..
– ఆర్డీఓ వేణుమాధవ్ రావు
పెన్పహాడ్, ఏప్రిల్ 27 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణుమాధవరావు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మాచారం, అనాజీపురం, అనంతారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లుల్లో వెంటనే ధాన్యం దిగుమతులు అయ్యే విధంగా, లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంటాలో లేడా వస్తే నిర్వాహకులు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు.
కేంద్రాల్లో గోనె సంచులు, పట్టాలు అందుబాటులో ఉంచి రైతులకు సౌకర్యాలను కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటిని త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జి.రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, కొనుగోలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

