మునుగోడు, ఏప్రిల్ 29 : కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయించి పంపాలని నల్లగొండ జిల్లా మునుగోడు తాసీల్దార్ నరేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మురళి మనోహర్ రైస్ మిల్లును ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాల లోడుతో వచ్చే లారీలను వెంటనే అన్లోడ్ చేసి పంపించాలని మిల్లర్లకు సూచించారు.
లారీలు మిల్లర్ల దగ్గర ఆగిపోతే కొనుగోలు కేంద్రాల వద్ద జాప్యం జరుగుతుందన్నారు. తూకం వేసిన వడ్ల బస్తాలను తరలించేందుకు కేంద్రాల నిర్వాహకులు సహకరించాలన్నారు. వడ్లను ఆరగానే తూకం వేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట సివిల్ సప్లై డిటి, ఆర్ఐ, పీఏసీఎస్ సీఓ ఉన్నారు.
Munugode : ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయాలి : తాసీల్దార్ నరేందర్